2 దశాబ్దాల తరువాత తెరపై అజిత్ భార్య షాలిని

బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం పాండిచేరిలో జరుగుతోంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 2022 వేసవిలో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ విజువల్ వండర్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-