‘ఫెఫ్సి’కి తల అజిత్ భారీ విరాళం

కోవిడ్-19 కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు తగిన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి సినీ ప్రముఖులపై కూడా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కరోనా పై పోరాటానికి ఒక్కటవుతోంది.

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కుమార్ పెప్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) యూనియన్ కు కు భారీగా విరాళాలు అందించారు.

శనివారం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఫెఫ్సి అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఈ విషయాన్ని తెలియజేశారు. కరోనా కారణంగా గా టీవీ, సినిమా షూటింగులు మే 31 వరకు నిలిపివేశారు. ఈ సంక్షోభ సమయంలో పని లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి విరాళాలు ఇవ్వాలంటూ సినీ ప్రముఖులను ఆర్కే సెల్వమణి కోరారు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరో అజిత్ 10 లక్షలు విరాళంగా ఇచ్చారు అని ప్రకటించిన సెల్వమణి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘నవరస’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసనన్ పెప్సీ యూనియన్ కి 10 కోట్ల భారీ విరాళాన్ని అందించినట్టు ఆర్కే సెల్వమణి ప్రకటించారు. ఈ విరాళాలతో ఆరు నెలల పాటు ప్రతి నెలా యూనియన్ లోని ప్రతి కార్మికుడి ఖాతాలోకి రూ.1500 జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

Related Articles

Latest Articles

-Advertisement-