సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు: అజయ్ జైన్

తొమ్మిది నుంచి పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉండటంతో ప్రొబేషన్ డీక్లేరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌ జైన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులను విధుల్లో చేరాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.

Read Also: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోపిడి చేస్తున్నారు: డీకే.అరుణ

మిగిలిన ఉద్యోగులు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూపొందించిన ప్రక్రియ అన్నారు. ఇందులో ఎవ్వరికీ అన్యాయం జరగదని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టి అపోహలు సృష్టించే పనులు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని అజయ్‌ జైన్‌ ఉద్యోగులను కోరారు.

Related Articles

Latest Articles