విహారి ఏం తప్పు చేసాడు : జడేజా

ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా సౌత్ ఆఫ్రికా పర్యటనకు పంపిస్తుంది. అయితే విహారిని ఇక్కడ ఇండియాలో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎందుకు ఎంపిక చేయలేదు. అతను చేసిన తప్పేంటి అని బీసీసీఐని ప్రశ్నించాడు భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా.

విహారి కొంతకాలంగా భారత టెస్ట్ జట్టులో ఉంటున్నాడు. బాగా ఆడుతున్నాడు కూడా. కానీ అతడిని ఇక్కడ ఇండియాలో జరిగే ముఖ్యమైన టెస్ట్ సిరీస్ కు కాకుండా ఇండియా ఏ టూర్ కి ఎందుకు పంపిస్తున్నారు. అతను ఏమి తప్పు చేసాడు…? అతను ఇండియా ఏ టూర్‌ కి ఎందుకు వెళ్లాలి. అతను ఇక్కడ కివీస్ టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడలేడు అనేది చెప్పాలి. లేదంటే అతన్ని ఆ ఏ టూర్‌ కి పంపకండి అని జడేజా అన్నాడు. ఇప్పటివరకు భారత జట్టుతో ఉన్న ఆటగాడు తర్వాత భారత ఏ జట్టులోకి వెళ్లి… ఆ స్థానంలో ఎవరైనా కొత్త ఆటగాడు భారత జట్టులోకి వస్తే అతని మనసు ఎంత బాధపడుతుంది అని జడేజా అన్నారు. అయితే విహారి స్థానంలో ఇక్కడ భారత జట్టులోకి శ్రేయర్ అయ్యర్ వచ్చిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles