లేటుగా వచ్చినా లెటెస్ట్ గా వస్తామంటోన్న అజయ్, రకుల్!

అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మేడే’. థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా భాగం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఫిల్మ్ సిటీలో బిగ్ బి, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీనటులు పాల్గొన్న షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. అయితే, లాక్ డౌన్ కారణంగా అజయ్ దేవగణ్ ఇతర సినిమాల మాదిరిగానే ‘మేడే’ కూడా సందిగ్ధంలో పడింది. అజయ్ నటించిన ‘భుజ్’, ‘మైదాన్’ సినిమాలు కూడా జనం ముందుకు రావాల్సి ఉంది. అయితే, ‘భుజ్’ డిస్నీ హాట్ స్టార్ పై డిజిటల్ గా రిలీజ్ అవ్వనుందని సమాచారం. ‘మైదాన్’ ఇంకా కొంత భాగం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తరువాతే ‘మేడే’ వంతు వస్తుందని అంటున్నారు. ‘మేడే’ 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుందని చెబుతున్నారు. అంటే, దాదాపుగా సంవత్సరం టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్ లోనే అలరిస్తుందట. ‘మేడే’ ఓటీటీ రిలీజ్ అన్నది ఒట్టి పుకారేనని అజయ్ దేవగణ్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-