లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?

సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్‌ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. ‘మహా సముద్రం’ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధార్థ్ గైర్హాజరు అయ్యాడు. ఇదే విషయం డైరెక్టర్ ను ప్రశ్నించగా, సిద్ధార్థ్ సర్జరీ కోసం లండన్ వెళ్లాడని, త్వరలో తిరిగి వస్తాడని మీడియాకు తెలిపాడు. అయితే సిద్ధార్థ్ సర్జరీకి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Read Also : ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?

టాలీవుడ్‌లో సిద్ధార్థ్ చివరిసారిగా 2013లో ‘జబర్దస్త్’ చిత్రంలో కనిపించాడు. ‘మహా సముద్రం’ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానేర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళంలో 14 అక్టోబర్ 2021న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మహా సముద్రం’ ఒక ప్రేమకథ. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

-Advertisement-లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?

Related Articles

Latest Articles