షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్ సినిమాలో నటించనన్న ఐశ్వర్య రాయ్!

‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా కరణ్ జోహర్ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన చిత్రం. అంతే కాదు, అది షారుఖ్ కి, కాజోల్ కి, రాణీ ముఖర్జీకి కూడా చాలా స్పెషల్ మూవీ. అసలు ప్రేక్షకుల దృష్టి నుంచీ చూస్తే ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్ చరిత్రలోనే తప్పక చెప్పుకునే సినిమాల్లో ఒకటి! కానీ, ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం వస్తే ఎందరు కథానాయికలు నో చోప్పారో తెలుసా?

‘కుచ్ కుచ్ హోతా హై’ రాహుల్, అంజలి, టీనా మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాహుల్ గా ఎస్ఆర్కే నటించాడు. అంజలిగా కాజోల్ నటించింది. ఇక టీనా పాత్ర కోసం మాత్రం దర్శకుడు కరణ్ జోహర్ చాలా మందినే అప్రోచ్ అయ్యాడు. ట్వింకిల్ ఖన్నా, ఊర్మిళ, టబు, శిల్పా శెట్టి, రవీనా టాండన్, కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్… వీరంతా ‘సారీ’ చెప్పి వెళ్లిపోయిన వారే! చివరకు, రాణి ముఖర్జీ ఆ పాత్ర చేసింది. ఆమె కెరీర్ కు అది తిరుగులేని బ్రేక్ ఇచ్చింది!

‘కుచ్ కుచ్ హోతా హై’లో టీనా రోల్ చేయమన్నప్పుడు తిరస్కరించిన అందరు హీరోయిన్స్ లో కేవలం ఐశ్వర్య రాయ్ మాత్రమే మళ్లీ కరణ్ కి ఫోన్ చేసిందట. ఎందుకు క్యారెక్టర్ చేయలేకపోతోందో అతడికి స్వయంగా వివరించి చెప్పిందట. ఇంతకీ, ఐష్ ఏ కారణం చేత షారుఖ్ సరసన లవ్ స్టోరీని రిజెక్ట్ చేసింది? అప్పట్లో ఆమె ఏ పాత్ర చేసినా విమర్శకులు తెగ విశ్లేషణలు చేసేవారు. అందుకే, ‘కుచ్ కుచ్ హోతా హై’లో టీనా పాత్ర స్టైలిష్ గా, పొట్టి స్కర్టులు వేసుకుని, కాస్త సెక్సీ అప్పియరెన్స్ ఉండటంతో ఐశ్వర్య వద్దందట. అదుగో, మిస్ వరల్డ్ మళ్లీ గ్లామర్ పాత్రకి ఓటు వేసింది, నటన రాదు అంటారని భయపడిందట! అది కూడా నిజమే… ‘కుచ్ కుచ్ హోతా హై’లో నటించే అవకాశం మొత్తం కాజోల్ కే దక్కింది. రాణీ పాత్ర కేవలం కాస్సేపు గ్లామరస్ గా కనిపిస్తుంది, అంతే…
‘కుచ్ కుచ్ హోతా హై’ సమయంలో కుదరని కరణ్ జోహర్, ఐశ్వర్య కాంబినేషన్ ‘యే దిల్ హై ముష్కిల్’లో వర్కవుట్ అయింది. మిసెస్ బచ్చన్ కోసం కేజో మంచి పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టరే ఆఫర్ చేశాడు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-