విమాన ప్రయాణికులకు షాక్..

విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ.2,300 నుంచి రూ.2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం ఉన్న రూ. 2,900 నుంచి రూ.3,300కి పెంచింది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ. 4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700 కి పెంచింది పౌర విమానయాన శాఖ. అలాగే 120-150 నిమిషాల ప్రయాణానికి రూ. 6100, కాగా 180-210 నిమిషాల ప్రయాణానికి రూ.8700గా నిర్ణయం తీసుకుంది పౌర విమానయాన శాఖ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-