తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌: లండ‌న్‌కు నేరుగా…

క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు భార‌త సివిల్ ఏవియేష‌న్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.  ఇక‌పై హైద‌రాబాద్ నుంచి నేరుగా లండ‌న్‌కు నాన్‌స్టాప్‌గా విమాన స‌ర్వీసుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.   ఈ రోజు నుంచే ఈ స‌ర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.  ఈరోజు లండ‌న్ నుంచి ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం హైద‌రాబాద్ చేరుకుంటుంది.  రేపు హైద‌రాబాద్ నుంచి లండ‌న్‌కు నాన్‌స్టాప్ విమానం బ‌య‌లుదేరుతుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు దుబాయ్, జ‌ర్మ‌నీ మీదుగా లండ‌న్ వెళ్లాల్సి వ‌చ్చేది.  దీని వ‌ల‌న చాలా స‌మ‌యం వృధా అవుతుంది.  దీనికోసం నాన్‌స్టాప్ స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా.  పైగా ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో క‌రోనా కేసులు ఇంకా త‌గ్గ‌క పోవ‌డం, ఆంక్ష‌లు అమ‌లులో ఉండ‌టంతో నాన్‌స్టాప్‌గా స‌ర్వీసులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  

Read: సెప్టెంబ‌ర్ 9, గురువారం దిన‌ఫ‌లాలు…

Related Articles

Latest Articles

-Advertisement-