రాజ్య‌స‌భలో అన్నాడీఎంకే ఎంపీ రికార్డ్‌…

రాజ్య‌స‌భ స‌మావేశాల‌కు ఎంత‌మంది హాజ‌ర‌య్యారు అనే దానిపై రాజ్య‌స‌భ స‌చివాలయం గణాంకాల‌ను త‌యారు చేసింది. అధికారుల లెక్క‌ల ప్ర‌కారం గ‌డిచిన ఏడు రాస్య‌స‌భ స‌మావేశాల‌కు 78 శాతం మంది ఎంపీలు రోజూ హాజ‌ర‌వుతున్న‌ట్టుగా గుర్తించారు. అందులో 30శాతం మంది క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. 2019 నుంచి 2021 వ‌ర‌కు మొత్తం ఏడు రాజ్య‌స‌భ స‌మావేశాలు జరిగాయి. రాజ్య‌స‌భ‌లో 225 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా రాజ్య‌స‌భ‌కు హాజ‌రైన‌పుడు త‌ప్ప‌నిస‌రిగా సంత‌కాలు చేయాల్సి ఉంటుంది. 248 వ స‌మావేశం నుంచి 254 వ స‌మావేశం వ‌ర‌కు తీసిన లెక్క‌ల ప్ర‌కారం ఏడు స‌మావేశాల‌కు 29.18 శాతం మంది హాజ‌ర‌య్యారు. ఏడు స‌మావేశాలు 138 రోజుల‌పాటు జ‌రిగాయి. ఈ 138 రోజులూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఒకే ఒక్క ఎంపీ హాజ‌ర‌య్యారు. అన్నాడీఎంకేకు చెందిన ఎస్ఆర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క్ర‌మం త‌ప్ప‌కుండా ఏడు స‌మావేశాల‌కు హాజ‌ర‌వ్వ‌గా, ఏపీకి చెందిన టీజీ వెంక‌టేష్ మ‌రో ఆరుగురు స‌భ్యులు ఆరు స‌మావేశాల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యారు.

Read: ఏడు గంట‌ల్లో 7 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం…

-Advertisement-రాజ్య‌స‌భలో అన్నాడీఎంకే ఎంపీ రికార్డ్‌...

Related Articles

Latest Articles