మాంసాహారం విక్రయాలపై గుజరాత్‌ సంచలన నిర్ణయం.. వారికి షాక్..!

గుజరాత్‌ సర్కార్‌ మాంసాహార విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రోడ్డుపై ఆహారం విక్రయించే వారిపై ప్రతీకూల ప్రభావం చూపుతుందనే ఆందోళన మొదలైంది… అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఫుడ్‌స్టాళ్లలో మాంసాహారం విక్రయించడంపై నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుండగా.. మరి కొందరు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.. ముఖ్యంగా చిరు వ్యాపారులు.. ఈ నిర్ణయం.. తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. తమ ఉపాధిని దెబ్బతీయడమేనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు..

Read Also: దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!

హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారాన్ని అనుమతించి.. రోడ్డు పక్కన స్టాళ్లలో మాత్రం అమ్మకూడదంటూ నిషేధం విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు.. రోడ్డు సైడ్‌లో ఉన్న స్టాళ్లలో మాత్రమే మాంసాహారమా..? హోటళ్లలో కాదా ? అని ప్రశ్నిస్తున్నారు.. ఇక, ఈ నిర్ణయం కాస్త వివాదాస్పదం కావడంతో.. ఈ వ్యవహారంపై స్పందించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ప్రజల భిన్నమైన ఆహారపు అలవాట్లతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు.. కానీ, పరిశుభ్రత, పౌర సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ‘కొంతమంది శాఖాహారం తీసుకుంటారు.. మరికొందరు మాంసాహారం తింటారు.. కానీ, దీంతో బీజేపీ సర్కార్‌కు వచ్చిన నష్టమేమీ లేదన్న ఆయన.. అయితే, రోడ్డు పక్కన విక్రయించే ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయన్నారు.. కాగా, ఈ నిర్ణయం కేవలం చిరు వ్యాపారులపైనే కాదు.. రోడ్డు పక్కనే తక్కువ ధరకు దొరికే ఆహారాన్ని తీసుకునేవారిపై కూడా ప్రతీకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.. స్కూళ్లు, కాలేజీలు, మతపరమైన ప్రదేశాలు.. అసలు లేనిది ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Latest Articles