‘ఆహా భోజనంబు’… మధ్యలో కాస్తంత అల్లరి!

యాక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు… బుల్లితెర స్టార్ యాంకర్ కూడా మంచు లక్ష్మీ! ఇవాళ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది యాంకర్స్ కంటే ముందే టీవీలో సూపర్ షోస్ చేసి, గొప్ప వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వాలే కానీ తన సత్తా చాటుతూనే ఉన్నారామె. వివిధ ఛానెల్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు వాటి ద్వారా ఎంతో మందికి సాయం చేసిన గొప్ప మనసు మంచు లక్ష్మీ సొంతం.

తాజాగా ఆహా ఓటీటీలో మంచు లక్ష్మీ ‘భోజనంబు’ పేరుతో ఓ కుకింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ నెల 23 నుండి ఈ కార్యక్రమం టెలీకాస్ట్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్ లో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నాడు. అతనితో మంచు లక్ష్మీ దలస్తా రిసిపీ చేయించింది. విశేషం ఏమంటే… ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్యూజన్ లో కన్ ప్యూజన్ అన్నట్టు ఫన్నీ ఫన్నీగా సాగింది. కుకింగ్ చేయాల్సిన విశ్వక్ సేన్ చేతి వేలికి కట్టుతో రావడం కొసమెరుపు. ‘వేలెక్కడ పెట్టావ్?’ అంటూ మంచు లక్ష్మీ ఎపిసోడ్ ప్రారంభంలోనే కొంటెగా ప్రశ్నిస్తే… దానికి చివరిలో ‘నేను చిన్నగున్నప్పుడు చూస్తుండే మీ షోస్’ అంటూ విశ్వక్ సేన్ కౌంటర్ వేసేశాడు. ‘గర్ల్ ఫ్రెండ్….’ అని అనగానే విశ్వక్ లాగ్ ఇవ్వడాన్ని గమనించిన మంచు లక్ష్మీ ఆట పట్టించేశారు. మొత్తం మీద ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ స్పైసీగా ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. మరి అందులో నిజమెంతో తెలియాలంటే ఈ నెల 23 వరకూ ఓపిక పట్టాల్సిందే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-