అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై హైకోర్టులో విచారణ…

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుపుతుంది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు తీవ్రంగా స్పందించారు జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్. అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు హైకోర్టు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్న హైకోర్టు… అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంధ్రాలో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టు కు ఎపి విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తున్నారని సంకేతాలు వచ్చాయి. బినామీ ద్వారా మిడ్జిల్ లో అగ్రిగోల్డ్ యాజమాన్యం భూములు కొనింది అని సంచలన అఫిడవిట్ దాఖలు చేసారు తెలంగాణ సిఐడి ఎస్పి.

మిడ్జిల్ లో 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి అగ్రిగోల్డ్ కంపెనీ బినామీ అని సందేహం వ్యక్తం చేసిన తెలంగాణ సిఐడి… అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్ అవ్వా సీతారామ రావు కు చెందిన శివశక్తి టింబర్ ఎస్టేట్ తో బిడ్ లో పాల్గొన్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తి 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు కొనే సామర్థ్యం లేదని ఇన్ కం టాక్స్ శాఖ ద్వారా సేకరించిన వివరాలు సమర్పించారు.

రెండు రాష్ట్రాలు అగ్రిగోల్డ్ సమస్యపై చర్చించి కలిసి పరిష్కారం కనుక్కునేందుకు హైకోర్టును సమయం కోరిన ఎపి అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్… విజయవాడలో ఎస్బిఐ నిర్వహించిన వేలంలో అగ్రిగోల్డ్ కు చెందిన షాపింగ్ మాల్ ను సింగిల్ బిడ్డర్ కు కేటాయించడం పై సిఐడి పరిశీలన జరిపేందుకు సమయం కావాలని కోరారు ఎపి అడ్వకేట్ జనరల్. ఈ కేసులో తదుపరి విచారణ 25.6.2021 కి వాయిదా వేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-