నాగ్ కు కోడలి కారణంగా కోపం వచ్చిందా?

‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే ఇంటర్నెట్ లో ట్రోలింగ్ కి, మామగారి వర్రీకి కారణమైంది!

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ చూస్తే ఎవరికైనా సమంత పాత్ర ఏంటో తెలిసిపోతుంది. అయితే, మొత్తంగా మనం ఊహించుకున్నదే కరెక్టా అంటే… అలా ఉండకపోవచ్చు! డైరెక్టర్స్ అండ్ రైటర్స్ షోలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో మనకు తెలియదు. కానీ, ఇప్పటికైతే నెటిజన్స్ కు… మరీ ముఖ్యంగా, తమిళ జనాలకు సమంత ఓ టెర్రరిస్ట్ గా అనిపిస్తోంది. అంతే కాదు, ఆమె తమిళ డైలాగ్స్ చెబుతుండటంతో పాకిస్తాన్ తో చేతులు కలిపిన చెన్నై అమ్మాయి అనుకుంటున్నారు. అదే ట్రోలింగ్ కారణం అవుతోంది. ఆమె పాత్రపై సొషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సమంత వెరీ ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే వివాదాస్పదం కావటం నాగ్ కు నచ్చలేదట. అసలు సిరీస్ లో ఏముందో తెలియకుండా ట్రోలింగ్ చేస్తున్న వారిపై ఆగ్రహంగా ఉన్నాడట. కాకపోతే, ఇప్పటికిప్పుడు అస్సలు స్పందించ వద్దని అమేజాన్ ప్రైమ్ , ‘ ద ఫ్యామిలీ మ్యాన్’ షో మేకర్స్ రిక్వెస్ట్ చేశారట. సమంతని కూడా వారు అదే అభ్యర్థించారట. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదల తరువాత అన్ని సందేహాలు, దుష్ప్రచారాలకు బ్రేక్ పడుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారట. చూడాలి మరి, కోడలి ట్రోలింగ్ తో టెన్షన్ లో ఉన్న నాగార్జున రిలీజ్ దాకా ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో! కాకపోతే, ట్రైలర్ లో స్యామ్ ని చూస్తే మాత్రం మంచి పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టర్ చేసిందని మనం పక్కాగా చెప్పవచ్చు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-