భార‌త్‌ను మ‌ళ్లీ భ‌య‌పెడుతున్న స్పైవేర్‌…

రెండేళ్ల క్రితం భార‌త్‌లో పెగాస‌స్ సంస్థ త‌యారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భార‌త్‌ను భ‌య‌పెడుతున్న‌ది.  ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు.  క్రిమిన‌ల్స్‌, ఉగ్రవాదుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప‌లు దేశాలు ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి.  ఈ స్పైవేర్ స‌హాయంతో హ్యకింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐఫోన్ త‌మ యూజ‌ర్ల‌కోసం ఐఓఎస్ అప్డేట్ వెర్ష‌న్‌ను రిలీజ్ చేసింది.  కాగా, ఈ స్పైవేర్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను కూడా హ్యాక్‌చేసే సామ‌ర్ధ్యం ఉంద‌ని తెలియ‌డంతో మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది.  2019లో తొలిసారి ఇండియాలో ఈ స్పైవేర్ క‌ల‌క‌లం సృష్టించింది.  వాట్స‌ప్ ద్వారా అజ్ఞాత సందేశాలు వ‌స్తున్నాయ‌ని గ‌తంలో పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  

Read: “రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?

కాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ స్పైవేర్ క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఇటీవ‌ల దాదాపుగా 50 దేశాల‌కు చెందిన 50 వేల మంది ఫోన్ నెంబ‌ర్లను హ్యాక్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఇందులో 189 మంది జ‌ర్న‌లిస్టులు, 600 మందికి పైగా రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు, వ్యాపార‌వేత్త‌లు ఉన్నార‌ని స‌మాచారం.  ఒక్క భార‌త్‌లోనే 300 మందికి పైగా బాధితులు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  పెగాస‌స్ ర‌హ‌స్యంగా మ‌న‌కు తెలియకుండానే మ‌న ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది.  దీనిని మిస్‌కాల్‌ద్వారా మొబైల్‌లోకి ప్ర‌వేశిస్తుంది.  ఆ త‌రువాత మిస్‌డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది.  అక్క‌డినుంచి కాల్ డేటాను, వాట్ప‌ప్ డేటాను, ఎన్‌క్రిప్టెడ్ సందేశాల‌ను స్పైవేర్ రీడ్ చేస్తుంది.  ఒక‌వేళ త‌ప్పుడు డివైజ్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు తెలిస్తే 60 రోజుల త‌రువాత ఆ స్పైవేర్ దానంత‌ట అదే నాశనం అవుతుంది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-