ఢిల్లీలో భారీగా పెరిగిన కేసులు… 15 శాతం దాటిన పాజిటివిటీ రేటు…

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు ముగిసిన రోజుల వ్య‌వ‌ధిలోనే దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  వారం క్రితం రోజువారి కేసులు ప‌దివేల లోపు ఉండ‌గా, ఇప్పుడు రోజువారి కేసుల సంఖ్య 90 వేలు దాటింది.  ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఢిల్లీలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోయింది.  దేశ‌రాజ‌ధానిలో గ‌డిచిన 24 గంట‌ల్లో 15,097 కేసులు న‌మోద‌య్యాయి.  ఆరుగురు క‌రోనాతో మృతి చెందారు.  ఇది కొంత ఊర‌ట‌నిచ్చే అంశ‌మే.  కేసులు పెరుగుతున్నా మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంది.  

Read: స్పెష‌ల్ స్వీట్‌…కిలో జ‌స్ట్ 16 వేలు…!!

అయితే, వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో రాబోయే రోజుల్లో ఆసుప‌త్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని, మ‌ర‌ణాల సంఖ్య పెర‌గొచ్చ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక ఢిల్లీలో ప్ర‌స్తుతం 31,498 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  పాజిటివిటీ రేటు 15.34 శాతంగా ఉంది.  నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే 5 శాతం పాజిటివిటీ రేటు నుంచి 15 శాతానికి పెరిగింది.  ఇది ఇలా పెరుగుతూ పోతే ఢిల్లీ న‌గ‌రం మొత్తం ష‌ట్‌డౌన్ చేయాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతాయి.  24 గంట‌ల్లో 6900 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  

Related Articles

Latest Articles