ఆ దేశంలో మ‌ళ్లీ విజృంభించిన క‌రోనా… ప‌దిరోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌…

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో చాలా దేశాలు స‌ఫ‌లం అయ్యాయి.  కొన్ని దేశాల్లో క‌రోనాను కంట్రోల్ చేసేందుకు వేగంగా వ్యాక్సినేష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కంట్రోల్ కావ‌డం లేదు.  యూర‌ప్‌లోని ఆస్ట్రియా దేశంలో క‌రోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి.  దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ అందించిన‌ప్ప‌టికీ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.

Read: లైబ్రరీలో హాట్ యాంకర్.. బుక్స్ చదువుతుందా..? అందాలు ఆరబోస్తుందా..?

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో ప‌దిరోజుల‌పాటు దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  సోమ‌వారం నుంచి ఈ లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది.  క‌రోనా అదుపులోకి రాకుంటే మ‌రికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తామ‌ని ఆ దేశ ఛాన్స‌ల‌ర్‌ తెలిపారు.  క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఇంత‌కు మించి మ‌రోక మార్గం లేద‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ విధించాల్సి వ‌చ్చిన‌ట్టు ఛాన్స‌లర్ అలెగ్జాండ‌ర్ షాలెన్‌బ‌ర్గ్ తెలిపారు.

Related Articles

Latest Articles