ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక  జ‌రుగుతున్న ప‌రిణామాలు దారుణంగా ఉంటున్నాయి.  ఆ దేశంలో ఉగ్ర‌వాద శ‌క్తులు బ‌లం పుంజుకొని సాధార‌ణ‌ప్ర‌జ‌ల‌పై దాడులు చేస్తున్నారు.  కొన్ని తెగ‌ల ప్ర‌జ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బాంబుదాడుల‌కు పాల్ప‌డుతున్నారు.  ఆఫ్ఘ‌న్ రాజ‌ధానిలో వ‌ర‌స‌గా బాంబు పేలుళ్లు జ‌రుగుతున్నాయి.  ఈరోజు ఉద‌యం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జ‌రిగింది.  

Read: ఈజిప్ట్‌లో బ‌య‌ట‌ప‌డిన సూర్య‌దేవాల‌యం… ఏ కాలానికి చెందిన‌దో తెలుసా…

ఉద‌యం జ‌రిగిన  పేలుడు సంఘ‌ట‌న నుంచి ఇంకా తేరుకోక‌ముందే మ‌రోచోట బాంబు పేలుడు జ‌రిగింది.  హ‌జారా తెగ ప్ర‌జ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బాంబు పేలుడుకు పాల్ప‌డ్డార‌ని, ఈ పేలుళ్లో ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్టు అధికారులు తెలిపారు.  అయితే, ఈ పేలుళ్ల‌కు బాధ్యులు ఎవ‌రు అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  ఉద‌యం జ‌రిగిన పేలుడులో న‌లుగురు మృతి చెంద‌గా, సాయంత్రం జ‌రిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు.  

Related Articles

Latest Articles