జగన్ భరోసా ఇచ్చారు.. నమ్మకంగా చెప్తున్నా- చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన నాతో మాట్లాడిన తీరు నాకు సంతృప్తినిచ్చింది. ఇక గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయంపై ఎంతో మీమాంస ఏర్పడింది. జటిలమైన ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి జగన్ గారు నన్నుఆహ్వానించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక సైడ్ మాత్రమే కాదు రెండు సైడ్లు వినాలని, మీరు వస్తే ఒక విధివిదానాన్ని తయారుచేసి .. తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నన్ను కోరడం ఎంతో భాద్యతగా అనిపించింది.

సామాన్య ప్ర‌జ‌ల‌కు వినోదం అందుబాటులో ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నా. సీఎం ప్ర‌య‌త్నానికి అభినంద‌న‌లు. ఇక అంతేకాకుండా థియేటర్ల వాళ్ళు పడుతున్న సాదరాబాధకాలు అన్ని తెలుపడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగాస్పందించి ఉభయతర ఆమోదయోగ్యంగా నిర్ణయానికి వచ్చి .. కమిటీకి చెప్తాము.. కమిటీ తుది నిర్ణయానికి వస్తాము అని చెప్పారు.. ఈ మాటలతో జగన్ గారిపై నాకు భరోసా వచ్చింది. నేను నమ్మకంగా చెప్తున్నా ఆయన మాటలు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. ఏదో మంచి చేయాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వం వైపు నుంచి ఉంది. నేను ఒక ప‌క్షాన ఉండ‌ను, అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తాన‌ని, భ‌య‌ప‌డొద్ద‌ని భ‌రోసా ఇచ్చారు. త్వరలోనే ఒక మంచి నిర్ణయంతో వస్తామని చెప్పారు. అందరికి ఆమోద యోగ్యం అయితే దాన్ని జీవో గా తీసుకొందామని చెప్పారు. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు.ఈ వారం పదిరోజుల్లో లేదా నెలలో కొత్త జీవో వస్తుంది.చిన్న సినిమాలపై కూడా ఆలోచించి ఐదో ఆటకు అనుమతి ఇస్తానన్నారు అని చెప్పుకొచ్చారు.

Related Articles

Latest Articles