మిజోరాం ను వణికిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ…

మిజోరాం రాష్ట్రంలో ప్ర‌స్తుతం స్వైన్ ఫ్లూ వేగంగా విస్త‌రిస్తోంది.  ఆఫ్రికన్ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపుగా 4800 పందులు మృత్య‌వాత ప‌ట్టాయి. మార్చి 21 వ తేదీన లంగ్‌లై జిల్లాలోని లంగ్‌సేన్ అనే గ్రామంలో మొద‌ట‌గా ఈ వ్యాధి బ‌య‌ట‌ప‌డింది.  ఆ త‌రువాత ఈ వ్యాధి 9 జిల్లాల‌కు పాకింది.  ఆ 9 జిల్లాల ప‌రిధితో దాదాపుగా 91 గ్రామాలు ఉండ‌గా, ఒక్క అయ్‌జోల్ జిల్లాలోనే 55 గ్రామాలు ఉండ‌టం ఆంధోళ‌న క‌లిగిస్తోంది.  ఈ ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు రైతులు రూ. 19 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ న‌ష్టపోయార‌ని ప‌శువ‌ర్ధ‌క శాఖ తెలియ‌జేసింది.  మిజోరాంలో తొలిసారిగా ఈ వ్యాధి బ‌య‌ట‌ప‌డింద‌ని, పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి పందుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం వ‌ల‌న ఈ వ్యాధి ప్ర‌భ‌లిన‌ట్లు మిజోరాం అధిరకారులు పేర్కొంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-