పాక్ ట్రోల‌ర్ల‌కు ఆఫ్ఘ‌న్ ధీటైనా జ‌వాబు…భార‌త్ విజ‌యాన్ని గుర్తు చేస్తూ…

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాలు త‌ప్పుకోవ‌డంతో తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.  అమాయ‌క ప్ర‌జ‌లపై దాడులు చేస్తున్నారు.  ఆఫ్ఘ‌న్ ఆర్మిని చెద‌ర‌గోడుతూ అనేక ప్రాంతాల‌ను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు.  ఇక పాక్ ఇప్ప‌టికే తాలీబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది.  దీంతో వారు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. మ‌రోవైపు పాక్ ట్రోల‌ర్లు ట్వట్ట‌ర్లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.  మంగ‌ళ‌వారం రోజున బ‌క్రీద్ సంద‌ర్భంగా అధ్య‌క్ష‌భ‌వ‌నంలో సామూహిక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు.  ఈ ప్రార్ధ‌న‌ల్లో అధ్య‌క్షుడితో పాటు ఉపాద్య‌క్షుడు అమ్రుల్లా స‌లే కూడా పాల్గోన్నారు.  ప్రార్ధ‌న‌లు జ‌రిగే స‌మ‌యంలో అధ్య‌క్ష‌భ‌వ‌నానికి స‌మీపంలో ముష్క‌రులు రాకెట్ దాడులు చేశారు. 

Read: “బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!


దీంతో ఉపాద్య‌క్షుడు ఉలిక్కిప‌డ్డాడు.  త‌మాయించుకొని తిరిగి ప్రార్ధ‌న‌లు చేసుకున్నారు.  దీనిని పాక్‌కు చెందిన ట్రోల‌ర్లు ట్విట్ట‌ర్‌లో ట్రోల్ చేయ‌డంతో ఉపాద్య‌క్షుడు అమ్రుల్లా స‌లేకి చిర్రెత్తుకొచ్చింది.  1971లో ఇండో పాక్ యుద్ధం స‌మ‌యంలో పాక్ సైన్యం ఇండియాకు లోంగిపోతూ అప్ప‌టి పాక్ జ‌న‌ర‌ల్ ఏఏకె నియాజీ సంత‌కం చేశారు.  ఆ ప‌క్క‌నే భార‌త్ లెప్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ జ‌గ‌జ్జిత్ సింగ్ అరోరా కూడా ఉన్నారు.  చారిత్రాత్మ‌క‌మైనా ఈ ఫోటోను షేర్ చేస్తూ మా దేశ చ‌రిత్ర‌లో ఇలాంటి ఫోటో లేద‌ని, ఇక‌పై కూడా రాద‌ని పేర్కొన్నారు. ఆనాటి భ‌యాన్ని పోగొట్టుకునేందుకు తాలీబ‌న్‌, ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తున్నారని, అవి భ‌యాన్ని పోగొట్ట‌లేవని ట్వీట్ చేశారు.   పాక్ ట్రోలర్ల‌కు ధీటైన స‌మాధానం చెప్పార‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-