ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు దాటేందుకు… ప్ర‌జ‌లు ఏం చేశారంటే…!!

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఆగ‌స్టు 30 వ‌ర‌కు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వైపు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఇప్పుడు అక్క‌డ ఒక్క పురుగు కూడా క‌నిపించ‌డం లేదు.  అమెరికా ద‌ళాలు లేక‌పోవ‌డంతో ప్రజ‌లంతా ఏమ‌య్యారు… ఎటువెళ్లారు.  తిరిగి ఇళ్ల‌కు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు.  అమెరికా ద‌ళాలు వెళ్లిపోయిన త‌రువాత ప్ర‌జ‌లు రూటు మార్చి ఇరాన్‌, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల వైపు ప‌రుగులు తీశారు.  వేల సంఖ్య‌లో ఇరాన్ స‌రిహ‌ద్దుల‌కు ప్ర‌జ‌లు చేరుకోవ‌డంతో అక్క‌డ భ‌ద్ర‌తను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.  ఆఫ్ఘ‌న్ నుంచి ఎవ‌ర్నీ ఇరాన్‌లోకి అనుమ‌తించ‌డం లేదు.  దీంతో స‌రిహ‌ద్దుల్లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  మ‌రోవైపు ఇటు పాక్ స‌రిహ‌ద్దుల వైపు కూడా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున చేరుకోవ‌డంతో అక్క‌డ కూడా ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. స‌రిహ‌ద్దుల్లో అధికారుల క‌ళ్లుగ‌ప్పి ఇరాన్ బోర్డ‌ర్ దాటిన కొంత‌మంది ప్ర‌జ‌లు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డామ‌ని చెబుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, అమెరికా, నాటో ద‌ళాలు పూర్తిగా త‌ప్పుకోవ‌డంతో త్వ‌ర‌లోనే తాలిబ‌న్ సుప్రీం క‌మాండ‌ర్ నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ఆ న‌గ‌రంలో పుట్‌పాత్‌ల‌పై అమ్మ‌కం నిషేదం… ఉల్లంఘిస్తే…

Related Articles

Latest Articles

-Advertisement-