ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌చ్చు… అయితే అలా మాత్రం కాదు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మ‌హిళ‌ల చ‌దువు విష‌యంపై తాలిబ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  1996లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌డానికి వీలు లేద‌ని, వారు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యి పిల్ల‌ల్ని క‌నేందుకు మాత్ర‌మే ప‌నిచేయాలి అనిచెప్పిన తాలిబ‌న్లు, ఈసారి కొంత మార్పును తీసుకొచ్చారు.  మ‌హిళ‌లు చ‌దువుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  మ‌హిళ‌లు విద్య‌ను అభ్య‌సించ‌వ‌చ్చున‌ని, అయితే పురుషుల‌కు, స్త్రీల‌కు వేరువేరుగా క్లాస్‌రూములు ఏర్పాటు చేయాల‌ని ఆఫ్ఘ‌న్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇక‌, మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా హిజ‌బ్‌లు ధ‌రించాల‌ని ఆదేశించింది. చ‌దువుకోవ‌డానికి అనుమ‌తిచ్చిన తాలిబ‌న్లు ఉద్యోగాలు చేసేందుకు, రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌డం లేదు.  త‌మ పాల‌న‌ను 20 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని,  ఇప్పుడున్న పునాదుల‌పైనే పునఃనిర్మాణం చేప‌డ‌తామ‌ని విద్యాశాఖ మంత్రి హుక్కాని పేర్కొన్నారు.  

Read: నిమ‌ర్జ‌నంపై హౌస్‌మోష‌న్ పిటిష‌న్‌… విచార‌ణ‌కు హైకోర్టు నిరాక‌ర‌ణ

Related Articles

Latest Articles

-Advertisement-