ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించకూడదు: ధోవల్

ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్‌ ధోవల్‌ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను కూడా న్యూఢిల్లీ ఆహ్వానించింది, అయితే రెండు దేశాలు ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు.

ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు “ఆశ్రయం, శిక్షణ, ప్రణాళిక లేదా ఆర్థిక సహాయం” కోసం ఉపయోగించరాదని ఈ డిక్లరేష న్‌లో స్పష్టంగా పేర్కొంది. కుందుజ్, కాందహార్, కాబూల్‌లలో ఇటీవ ల జరిగిన ఉగ్రవాద దాడులను కూడా ఇది ఖండిస్తుందని ధోవల్‌ తెలిపారు. పాకిస్తాన్ పేరు పెట్టకుండానే, మొత్తం ఎనిమిది దేశాలు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని మద్దతిస్తున్నాయని ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో తాలిబాన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు పడుతున్న బాధలపై ఈ ఎనిమిది దేశాలు కూడా “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశాయి. ఈ ప్రాంతంలో “రాడికలైజేషన్, తీవ్రవాదం, వేర్పాటు వాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముప్పుకు సంబం ధించి వ్యతిరేకంగా సామూహిక సహకారం” కోసం ఈ డిక్లరేషన్‌ పిలుపు నిచ్చింది. భారతదేశం, ఇరాన్, రష్యా, ఐదు మధ్య ఆసియా దేశాలు కూడా ఆఫ్ఘన్ ప్రజలందరి ఇష్టానుసారం ప్రాతినిథ్యం వహించే ప్రభు త్వాన్ని” ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఈ డిక్లరేషన్‌ నొక్కి చెప్పింది.

Related Articles

Latest Articles