అశ్లీల చిత్రాల కేసు: ఎట్టకేలకు రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, స్టార్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భ‌ర్త‌ రాజ్‌కుంద్రాకు బెయిల్ ల‌భించింది. పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్ట‌యిన ఆయనకు రూ. 50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ముంబైలోని మెట్రోపాలిట‌న్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవ‌కాశం కోసం ముంబైకి వ‌చ్చిన ప‌లువురు యువ‌తుల‌ను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో రెండు నెల‌ల క్రితం పోర్నోగ్ర‌ఫీ కేసులో పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు.

పోర్నోగ్రఫీ కేసులో జులై 19న రాజ్‌కుంద్రా సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ కేసులో విచార‌ణ ముగిసిన నేప‌థ్యంలో త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని రాజ్‌కుంద్రా ముంబై మెట్రోపాలిట‌న్ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో త‌న‌ను త‌ప్పుగా ఇరికించార‌ని, ఎఫ్ఐఆర్‌లో పేరు లేక‌పోయినా పోలీసులే త‌న‌ను కేసులోకి లాగార‌ని ఆరోపించారు. ఆయ‌న పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన ముంబై న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్ మంజూరు చేసింది.

-Advertisement-అశ్లీల చిత్రాల కేసు: ఎట్టకేలకు రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

Related Articles

Latest Articles