ఆ బాధ తట్టుకోలేక పోర్న్‌ స్టార్‌ ఆత్మహత్య

అమెరికా పోర్న్ స్టార్ డహ్లియా స్కై తన కారులోనే తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలిఫొర్నియాలోని లాస్‌ఏంజ్‌లెస్‌లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వాలీలో ఓ కారులో డాలియా స్కై మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే అక్కడున్న పరిస్థితులను విశ్లేషించిన పోలీసులు.. డాలియా స్కై ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టులోనూ అదే తేలింది.

31 ఏళ్ల డాలియా స్కై అసలు పేరు మెలిసా సిమ్స్ హేయిస్. 10 ఏళ్లుగా ఆమె పోర్న్ ఇండస్ట్రీలో ఉన్నారు. డాలియా స్కై ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే.. ఆమె కష్టాల గురించి తెలిసింది. ప్రస్తుతం ఆమె స్టేజ్‌ 4 బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె డిప్రెషన్‌కు లోనై సూసైడ్‌ చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-