ముంబైలో అడవి శేష్… అమరవీరుడికి నివాళి

యంగ్ హీరో అడవి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించాడు. విషాదకరమైన 26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకుంటూ ఆయన తల్లిదండ్రులు కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ సమక్షంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈరోజు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి తాజ్ మహల్ ప్యాలెస్‌ని సందర్శించడానికి ముంబైకి వెళ్తారు.

Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో శేష్, మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత లోతుగా మారింది. కాబట్టి సామాన్య ప్రజలను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశపు కొడుకును గుర్తు చేసుకోవడానికి, మేజర్ కు నివాళులు అర్పించడానికి తాజాగా అడివి శేష్ ముంబై చేరుకున్నారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ నటించిన పాన్ ఇండియా చిత్రం “మేజర్”. ఈ మూవీ హిందీ, తెలుగు, మలయాళంలో 2022 ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

Related Articles

Latest Articles