ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడంటే….

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు చిత్రాల షూటింగ్స్ తో క్షణం తీరికలేకుండా ఉన్నాడు. వాటిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ పాన్ ఇండియా మూవీ త్రీడీలో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకోగా, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ తెలిపారు. ప్రభాస్‌ ‘బాహుబలి’కి మూడు రెట్ల ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ ఇందులో ఉంటాయట.

విశేషం ఏమంటే… ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పాత్రకు అక్టోబర్ 9న, సీత పాత్రదారిణి కృతీ సనన్ కు అక్టోబర్ 16న ఓమ్ రౌత్ వీడ్కోలు పలికాడు. రామాయణం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీరామ పాత్రధారి ప్రభాస్‌ వర్క్ చాలా బాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఓ పక్క గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతూనే, అదే సమయంలో ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ ను నాన్ స్టాప్ గా జరిపి, వచ్చే నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఓం రౌత్ భావిస్తున్నాడట. అలా జరిగితేనే వచ్చే యేడాది ఆగస్ట్ 11కు సినిమాను విడుదల చేయగలరట. సో… ప్రస్తుతం ఓమ్ రౌత్ దృష్టి మొత్తం ప్రభాస్ ను రాముడిగా తీర్చిదిద్దడం మీదే ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Related Articles

Latest Articles