బెంజ్ ఎక్కబోతున్న ఆది సాయికుమార్!

కొత్త సంవత్సరం ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇలా జనంలోకి వెళ్ళిందో లేదో… అలా ఆది సాయికుమార్ ఇంటికి సరికొత్త బెంజ్ కారు వచ్చేసింది. సినిమా హీరోలకు హైటెక్ కార్లు కొనడం, అందులో తిరగడం అనేది ఓ సరదా! కెరీర్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో అవకాశం చిక్కితే చాలు కార్లనూ మార్చేస్తుంటారు. పాత వాటి స్థానంలో హైఎండ్ కారు కొనుగోలు చేస్తుంటారు.

ప్రస్తుతం చేతిలో ఆరేడు సినిమాలు ఉన్న ఆది సాయికుమార్ సైతం కొత్త సంవత్సరం ఓ బెంజ్ కారు కొనుగోలు చేశాడు. దాని డెలివరీ కూడా అయిపోయింది. ఈ సందర్భంగా తండ్రి, సీనియర్ నటుడు సాయికుమార్ తోనూ భార్య, పాపతోనూ కలిసి దిగిన ఫోటోలను ఆది సాయికుమార్ మీడియాకు విడుదల చేశాడు. సో… బెంజ్ స్పీడ్ లోనే ఆది సాయికుమార్ కెరీర్ కూడా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతుందేమో చూద్దాం.

Related Articles

Latest Articles