ఓటీటీ దిశగా తేజ సజ్జా ‘అద్భుతం’!?

బాల నటుడుగా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో హీరోగాను ఇమేజ్ పెంచుకున్నాడు. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఉనికి చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఇష్క్’ సినిమా ఘోరపరాజయం మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ పరాజయాన్ని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తేజ నటించిన ‘అద్భుతం’ సినిమా పూర్తయింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట. రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించారు. రాథన్ సంగీతం అందిన ఈసినిమాకు ప్రశాంత్ వర్మ రచన చేయటం విశేషం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మతోనే ‘హనుమాన్’ సినిమా చేస్తున్నాడు తేజ. ఈ రెండు సినిమాలతో తన కెరీర్ గాడిన పడుతుందనే ఆశాభావంతో ఉన్నాడు తేజ.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!

Related Articles

Latest Articles

-Advertisement-