‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మహా సముద్రం’ చిత్రం దసరా కానుకగా ఈనెల 14న విడుదలైంది. ఇక 15వ తేదీ శర్వానంద్ కొత్త సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కు సంబంధించిన పోస్టర్ ను దర్శక నిర్మాతలు కిశోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి విడుదల చేశారు. హీరో శర్వానంద్ ఏ ఒక్క జానర్ కో పరిమితం అయిపోకుండా, డిఫరెంట్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుంటున్నాడు. అలా ప్రస్తుతం ఈ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా గుమ్మానికి పూల తోరణాలు కట్టారు. రష్మిక, శర్వానంద్ ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ఉన్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సుజిత్ సారంగ్ కెమెరామెన్‌ కాగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Related Articles

Latest Articles