కన్నడ మీడియాపై సోనియా అగర్వాల్ ఆగ్రహం!

కన్నడ సోషల్ మీడియా చూపించిన అత్యుత్సాహం నటి సోనియా అగర్వాల్ కు తల నొప్పిని తెచ్చిపెట్టింది. సోమవారం ఉదయం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కుంభకోణం విషయమై మోడల్ టర్న్డ్ యాక్ట్రస్, కాస్మొటిక్ ఇండస్ట్రియలిస్ట్ సోనియా అగర్వాల్, డీజే వచన్ చిన్నప్ప, బిజినెస్ మ్యాన్ భరత్ ఇళ్లను సోదా చేశారు. అయితే… కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక, ’17 జి బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఫోటోలను ఈ వార్తతో పాటు పోస్ట్ చేశాయి. కొందరైతే… నటి సోనియా అగర్వాలే డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు పేర్కొన్నారు. ఈ వార్త సోనియా అగర్వాల్ కు చేరే సరికీ పుణ్యకాలం కాస్త గడిచి పోయింది. అప్పటికే తమిళ చిత్రం ‘గ్రాండ్ మా’ షూటింగ్ నిమిత్తం సోనియా అగర్వాల్ కేరళ కు వెళ్ళింది. ఆ పైన ఆమె దృష్టికి ఈ విషయం రాగానే తీవ్రంగా ఖండించింది. తన గురించి తప్పుగా రాసిన వెబ్ సైట్స్, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని పేర్కొంది. జర్నలిస్టులు సరైన హోమ్ వర్క్ చేయకుండా తన పరువుకు భంగం కల్పించారంటూ సోనియా అగర్వాల్ వాపోయింది.

Related Articles

Latest Articles

-Advertisement-