పోలీస్ స్టేషన్ లో నటి స్నేహ.. మోసం చేశారంటూ ఫిర్యాదు

టాలీవుడ్ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. తనను కొందరు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్‌ ​కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని తెలిపిన వారు ఇప్పుడు మోసం చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వారు తమపైనే దాడికి దిగారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఎలాగైనా వారివద్ద నుంచి డబ్బులు వసూలు చేయించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. స్నేహ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

Related Articles

Latest Articles