ఎదిగిపోయిన శ్రియా శ‌ర్మ‌!

క‌సౌటీ జింద‌గీ కే సీరియ‌ల్ లో బాలన‌టిగా ఉత్త‌రాది బుల్లితెర ప్రేక్ష‌కులను ఆకట్టుకున్న శ్రియా శ‌ర్మ 2011లో చిల్ల‌ర్ పార్టీ మూవీతో ఉత్త‌మ బాల‌న‌టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప‌లు చిత్రాల్లో బాల‌న‌టిగా అల‌రించింది. ప‌ద‌హారేళ్ళ ప్రాయంలోనే గాయ‌కుడు, నిర్మ‌ల కాన్వెంట్ సినిమాల‌తో తెలుగువారి ముందుకు హీరోయిన్ గా వ‌చ్చింది శ్రియాశ‌ర్మ‌. అయితే ఆ త‌ర్వాతే కాస్తంత గ్యాప్ తీసుకుంది. గ‌త యేడాది మాత్రం న‌ట‌న‌తో పాటు తాను లాయ‌ర్ కావాల‌నుకుంటున్నాన‌ని, న్యాయ‌వాద వృత్తిపట్ల త‌న‌కు మ‌క్కువ ఉంద‌ని మ‌న‌సులో మాట వెల్ల‌డించింది. విశేషం ఏమంటే… త‌మిళంలో సూర్య‌, జ్యోతిక జోడీకి వెండితెర కూతురుగా న‌టించిన శ్రియా శ‌ర్మ, తెలుగు అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌లో న‌టించి ఉండాల్సింది. జ‌స్ట్ ఆ మూవీ ఆమె చేజారిపోయింది. అయితే… 24 సంవ‌త్స‌రాల శ్రియా శ‌ర్మ ఇప్పుడు ప్రౌఢ‌గా అందంగా, ఆక‌ర్షీణ‌యంగా త‌యారైంది. చక్క‌ని చీర‌క‌ట్టులో మెరిసిపోతూ, కొన్ని ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొత్తం మీద ఇటు నటిగా, అటు లాయ‌ర్ గా రాణించాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ శ్రియా శ‌ర్మ కోరిక ఏమేర‌కు నెర‌వేరుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-