పేదలకు సాయం చేస్తున్న నటి షకీలా

కరోనా వైరస్ చాలా మంది జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఎందరో సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్న వారికి మీకు తోచినంత సాయం చేయండి అని ఆమె కోరుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-