హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ హీరోయిన్ విడాకులు.. ?

సంజనా గల్రాని.. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ.. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. జీవులకు వెల్ళడం .. బెయిల్ పై బయటికి రావడం.. ప్రేమించినవాడిని పెళ్లాడడం వరకు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక వివాహమైన తరువాత అమ్మడు కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సంజనా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత కొన్నిరోజుల క్రితం సంజనా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో నెటిజన్లు అందరు ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ విషెస్ తెలిపారు. ఇక ఆ వార్త నిజమో కాదో తెలియక ముందే ఆమెపై మరో పుకారు గుప్పుమంది.

పెళ్ళై ఏడాది కూడా కాకముందే సంజన విడాకులు తీసుకోనున్నట్లు కన్నడ మీడియా కోడై కూసింది. ఈ రూమర్స్ ని తట్టుకోలేని సంజన వాటిపై స్పందించక తప్పలేదు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ సంజనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన పర్సనల్ విషయాల్లో కలుగజేసుకొని హక్కు ఎవరికి లేదంటూ మండిపడింది. ఇక ఆమె సన్నహితులు సైతం ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ విడాకుల న్యూస్ ఎక్కడి నుచ్న్హి వచ్చి ఉంటుంది. నిప్పు లేనిదే పొగ రాదుకదా.. ఏవో విబేహాధాలు తలెత్తి విడాకుల వరకు వెళ్లారనే వార్త నిజమే అయ్యి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా సంజన ఇప్పుడు ఏది చేసినా సంచలనమే అంటున్నారు నెటిజన్లు.

Related Articles

Latest Articles