సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్.. ?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత లాక్‌వుడ్‌ చేరింది. ఈ హాలీవుడ్ హీరోయిన్ గత కొన్ని రోజులు సల్లు బాయ్ ఫామ్ హౌస్ లో ఉండడం, అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫంక్షన్ లో అమ్మడు కనిపించడంతో వీరిద్దరి మధ్య సీక్రెట్ డేటింగ్ నడుస్తుందని పుకార్లు గుప్పుమన్నాయి. వీరి రిలేషన్ గురించి ఆ నోటా ఈనోటా మాట్లాడుకుంటూ చివరికి సమంత వరకు చేరడంతో ఆమె కొద్దిగా సీరియస్ అయ్యింది.

” ఇటీవల చాలా వార్తలు వింటున్నాను.. ప్రజలు చాలానే మాట్లాడతారు. కానీ, అందులో నిజం లేదు. నేను సల్మాన్ ని కలిశాను .. అతను చాలా మంచి వ్యక్తి. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమి లేదు. నేను సల్మాన్ ని కలిసినట్టే హృతిక్ ని కలిశాను. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. అస్సలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు” అంటూ ఘాటుగానే స్పందించింది. ఇక దీంతో సమంత కూడా సల్లు భాయ్ కి సెట్ కాలేదని తెలుస్తోంది. వీరిద్దరి రిలేషన్ నిజమని త్వరలోనే సల్మాన్ పెళ్లి అనే వార్తలు విని ఆనందపడిన అభిమానులు కాస్త మరోసారి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఈ అమెరికా భామ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Samantha Lockwood reacts to her link-up rumours with Salman Khan |  Filmfare.com
సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్.. ?

Related Articles

Latest Articles