పెద్దపల్లి జిల్లాలో నటి పాయల్ హంగామా

నటి పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘RX 100’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. తొలి సినిమాలో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాతో మరిన్ని అవకాశాలు వచ్చిన.. సరైన హిట్ రాకపోవడంతో వెనకబడిపోయింది. కథ డిమాండ్ మేరకు ఏ పాత్రకు అయినా సై అంటుంది ఈ బ్యూటీ.. ప్రత్యేక సాంగ్ లోను పాయల్ అప్పుడప్పుడు మెరుస్తోంది. ఇదిలావుంటే, ఈ అమ్మడు ప్రస్తుతం సైడ్ బిజినెస్ లోను జోరు చూపిస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో బిజీగా వుంది.

నిన్న వరంగల్ నగరంలోని హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్స్ షోరూంను పాయల్ ప్రారంభించగా.. నేడు పెద్దపల్లి జిల్లాలో మరో షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. కాగా, ఆమెని చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు చూపించిన ప్రేమ, ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని పాయల్ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న ‘కిరాతక’ లో నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-