ఆ పాత్ర చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాను…

ముస్కాన్ సేథీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.  తెలుగులో బాల‌కృష్ట పైసా వ‌సూల్ సినిమాలో న‌టించింది.  అదే విధంగా రాగ‌ల 24 గంట‌ల్లో సినిమాలో కూడా న‌టించి మెప్పించిన న‌టి ముస్కాన్ సేథి.  తెలుగు సినిమాల‌తో పాటుగా అటు బాలివుడ్ చిత్రాల్లో కూడా న‌టించి మెప్పిస్తోంది.  బాలివుడ్ వెబ్ సీరిస్‌ల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మ‌రోప్ర‌స్థానం మూవీలో న‌టిస్తోంది.  త‌నీష్ హీరోగా న‌టించిన ఈ సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కించారు.  ఇందులో వ‌రుడు ఫేం భానుశ్రీ మెహ్రా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.  ఈ సినిమా త‌న‌కు వెరీ స్పెష‌ల్ మూవీ అని, ఇందులో త‌న‌కు చాలా పెద్ద డైలాగులు ఉన్నాయ‌ని, రియ‌ల్ టైమ్ రియ‌ల్ షాట్ మూవీ కావ‌డంతో వాటిని చాలా ప్రాక్టీస్ చేశాన‌ని తెలియ‌జేసింది.  ఇందులో తాను కొన్ని యాక్ష‌న్ సీన్స్‌లో కూడా న‌టించిన‌ట్టు తెలియ‌జేసింది.  యూనిట్ అంతా త‌ల‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రించార‌ని ముస్కాన్ సేథి పేర్కొన్నారు.  జానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈసినిమా ఈనెల 24 వ తేదీన విడుద‌ల కాబోతున్నది.  

Related Articles

Latest Articles

-Advertisement-