ఈడీ ముందుకు ఛార్మి.. వీటిపైనే విచారణ..!

సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు సినీనటి ఛార్మి..డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఆ నోటీసుల్లో పేర్కొన్న తేదీ ప్రకారం.. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చారు ఛార్మి.. తనతో పాటు చార్టెడ్ అకౌంటెంట్లను కూడా వెంట తెచ్చుకున్నారు.. ఇక, బ్యాంకు డీటెయిల్స్ అన్ని వెంట తీసుకొచ్చారు. అయితే, ఈడీ కార్యాలయానికి ఛార్మి చేరుకున్న సమయంలో.. అక్కడ హంగామా చేశారు ఛార్మి బౌన్సర్‌.. ఇక, కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది ఈడీ.. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత కాలంగా కెల్విన్ తో చార్మికి పరిచయం ఉంది? డ్రగ్స్ సేవించారా? కెల్విన్ తో పాటు సరఫరాకు కూడా సహకరించారా? అసలు ఎన్ని సార్లు కెల్విన్ అకౌంట్ కు ఛార్మి… మనీ ట్రాన్స్ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది ఈడీ.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-