లేటైనా లేటెస్ట్ గా అంటున్న అంజలి!

రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ పోస్టర్ ను చేశారు. దీనిని అంజలి ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానితో పాటే… ‘నాకు తెలుసు, నేను పార్టీకి ఆలస్యంగా వచ్చానని, కానీ నా సంతోషాన్ని, కృతజ్ఞతలను తెలియచేయాలని ఉంది’ అని పేర్కొంది. నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని చెబుతూ, అందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. మరీ ముఖ్యంగా ఇంతకాలం తనను అభిమానించిన ఫ్యాన్స్ కు అంజలి థ్యాంక్స్ చెప్పింది. మరో పదిహేను సంవత్సరాలు తాను నటిగా కొనసాగాలనుకుంటున్నానని, ఇదే ప్రేమను అందించమని కోరింది.

Read Also : ‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!

విశేషం ఏమంటే… ఏ తెలుగు రంగంతో అయితే చిత్రసీమలోకి ఆమె అడుగుపెట్టిందో…. అదే తెలుగు సినిమా ‘వకీల్ సాబ్’లో అంజలి ఈ యేడాది కీలకపాత్ర పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’లోనూ అంజలి నటిస్తోంది. నిజానికి తెలుగులో కంటే కూడా కెరీర్ ప్రారంభంలో అంజలికి తమిళంలో నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు ‘జర్నీ, షాపింగ్ మాల్’ వంటి చిత్రాలలో వచ్చాయి. ఏదేమైనా మూసలో పడిపోకుండా ఇటు గ్లామర్, అటు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ అంజలి ఇంతకాలం నటిగా రాణించడం గ్రేట్. మధ్యలో పలు వివాదాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసినా వాటినుండి కూడా బయటపడి ముందుకు సాగడం అభినందనీయం.

Related Articles

Latest Articles

-Advertisement-