మరో స్టార్ నటుడికి కరోనా

సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారికి కోవిడ్-19గా నిర్ధారణ కాగా, తాజాగా మరో నటుడు తనకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ తనకు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌లో విష్ణు విశాల్ ‘పాజిటివ్ రిజల్ట్ తో 2022 ప్రారంభించినట్లు చెప్పారు. “అబ్బాయిలో… అవును నాకు కోవిడ్ పాజిటివ్‌ రిజల్ట్ వచ్చింది. గత వారంలో నన్ను సంప్రదించిన ఎవరైనా దయచేసి జాగ్రత్త వహించండి. భయంకరమైన శరీర నొప్పులు, ముక్కు దిబ్బడ, గొంతు దురద, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో బౌన్స్ బ్యాక్ అవుతా” అంటూ విష్ణు విశాల్ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్

గత రెండు రోజులుగా భయంకరమైన వైరస్‌ సోకిన తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల జాబితాలో విష్ణు విశాల్ చేరారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో నటి త్రిష, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు ప్రియదర్శన్, నటుడు సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వీరంతా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related Articles

Latest Articles