‘ఆ స్కూల్ ని మూసేయండి’ అంటూ విశాల్ ఆగ్రహం!

విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అదే స్కూల్ కి చెందిన అనేక మంది పూర్వ విద్యార్థినులు కూడా రాజగోపాల్ అనే టీచర్ తమని వేధించాడని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోన్న సదరు టీచర్ తో పాటూ స్కూల్ కూడా టార్గెట్ అవుతోంది.
కోలీవుడ్ లోని అనేక మంది సెలబ్రిటీలు పీఎస్ బీబీ స్కూల్ కాంట్రవర్సీపై సొషల్ మీడియాలో స్సందిస్తున్నారు. విశాల్ సైతం తన ఆగ్రహం వెళ్లగక్కాడు. జనం అసలు ఆరోపణల్ని పక్కన పెట్టి, పీఎస్ బీబీ కేసులో, కమ్యూనిటి యాంగిల్ వెదుకుతున్నారు. కులాన్ని తీసుకు వచ్చి చర్చని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. అంతే కాదు, విశాల్ తన ట్వీట్ లో ఏకంగా స్కూల్ ని మూసేయమని డిమాండ్ చేశాడు. ఇంత వరకూ విద్యా సంస్థ తరుఫున బాధిత విద్యార్థినులకి ఎవ్వరూ క్షమాపణ చెప్పలేదని అన్నాడు. ఇలాంటి నేరాల విషయంలో తీవ్రంగా స్పందించాలని కోరుతూ సీఎం స్టాలిన్ క్యాబినేట్ లోని విద్యాశాఖ మంత్రిని కూడా ట్యాగ్ చేశాడు.
ఒకవైపు విశాల్, కమల్ లాంటి కోలీవుడ్ సెలబ్రిటీలు సీఎంకు వత్తాసు పలుకుతూ స్కూల్ ని మూసేయమంటుంటే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి మాత్రం వ్యతిరేకంగా వాదన వినిపిస్తున్నాడు. తప్పు చేసిన టీచర్ కి శిక్ష పడాలిగానీ మొత్తం స్కూల్ నే మూసి వేయటం ఏంటని ప్రశ్నించాడు. అవసరం అయితే తాను పీఎస్ బీబీ విద్యాసంస్థకి న్యాయ సహాయం కూడా అందిస్తానని, ద్రవిడ పార్టీ డీఎంకే కావాలని సదరు స్కూల్ మ్యానేజ్ మెంట్ ని టార్గెట్ చేస్తోందని ఆయన కామెంట్ చేశాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-