దసరాకి వస్తున్న సుదీప్ ‘కోటికొక్కడు’

కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో సుదీప్ కథ అందించగా మడోన్నా సెబాస్టియన్ నాయికగా నటిస్తోంది. శ్రద్ధా దాస్, అఫ్తాబ్ శివదాసాని, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక సుదీప్ నటిస్తున్న మరో సినిమా ‘విక్రాంత్ రోనా’ సినిమాకు సంబంధించి కూడా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌ స‌హ నిర్మాత. నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-