చంద్రబాబుపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు !

కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి రియల్ హీరోగా మారిపోయారు. అయితే తాజాగా ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై నారా చంద్రబాబు నాయుడు శనివారం రోజున వర్చువల్ సమావేశం నిర్వహించారు.

అయితే ఈ సమావేశంలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని సోనుసూద్ చెప్పుకొచ్చారు. పోరాటంలో మా ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు లాంటివి అని, తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-