కట్టప్ప ఆరోగ్యంపై అప్డేట్.. ఇంకా పరిస్థితి విషమం

కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నై లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అందరు అంటున్నట్లే ఆయన ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని,  ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెన్నై వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలోనే ఆయన కోలుకోంటారని, తమవంతు ప్రయత్నం తాము చేస్తున్నామని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కట్టప్ప అభిమానులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Latest Articles