మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు: నరేష్

‘మా’ ఎన్నికలు ఆక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ‘మా’పోటీదారుల హాట్ హాట్ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారగా.. తాజాగా నటుడు నరేష్, మంచు విష్ణు పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

నరేష్ మాట్లాడుతూ.. ‘మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఆయననే అయితేనే మాకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. మా మసకబరింది అని కొందరు కామెంట్ చేసినప్పుడు మసక బారలేదని చెప్పాను. ఎవరు పడితే వారు ‘మా’ సీటులో కూర్చుంటే పదవి మసకబారుతుంది. నేను వెల్ ఫేర్ కమిటీ చైర్మన్ గా వున్నప్పుడు ఆరు నెలల పాటు సర్వే చేసి అవకాశాలు కలిపించాం. వెల్ ఫేర్ కమిటీని విజయవంతగా నిర్వహించమని నరేష్ తెలిపారు.

పదవి వ్యామోహాలు ‘మా’లో వుండకూడదన్నారు నరేష్. పెద్దలు మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న మాటలకు నేను నా నోటికి తాళం వేసి కూర్చున్నాను. ఒక పదకొండు మంది మీడియా ముందుకు వెళ్ళి జరగనిది చెయ్యలేనివి అబద్ధాలు చెప్పుకొచ్చారు. కరోనా టైంలో మా శాయశక్తుల సభ్యులకు సేవ చేసాము. రెండు సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనులు చేసాము. ఈ మూడు ఏళ్లలో ‘మా’ ముందుకు పోయింది కానీ మసక బారాలేదని నరేష్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ‘మా’కి మంచి వారసుడు కావాలి. ఆలు లేదు చూలు లేదా అని అరు నెలల ముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నీ పెట్టారు. నా టర్మ్ లో మా సేవలకు మురళి మోహన్, చిరంజీవి గారు మెచ్చు కున్నారు. ఒక మంచి వారసుడిని ఇచ్చిపోవటం నా బాధ్యత.. మా కుటుంబానికి విష్ణు లాంటి ఒక మంచి మనిషి వుండాలి. ఎన్నో ఆలోచించిన తరువాత విష్ణు పర్ఫెక్ట్ వ్యక్తి అనుకున్నాను. నా పూర్తి మద్దతు విష్ణుకి తెలుపుతున్నాను. ఒక మిక్సి కొనేటప్పుడు అన్ని చూసుకొని కొంటాము. మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తాము అంటే ఎలా..? ‘మా’లో వున్న రెండు గ్రహాలు దారి తప్పాయి’ అంటూ నరేష్ కామెంట్స్ చేశారు.

-Advertisement-మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు: నరేష్

Related Articles

Latest Articles