మా భవనానికి వంద కోట్లైనా ఖర్చుపెడతాం: మంచు విష్ణు

‘మా’ అధ్యక్ష పదవి పోటీలో వున్నా మంచు విష్ణు నేడు తన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది తెలుగు సినిమా ఆత్మ గౌరవానికి చెందిన మేనిఫెస్టోగా మంచు విష్ణు తెలిపారు. మొదటి ప్రాధాన్యత అవకాశాలు కల్పించడమన్నారు. సొంత డబ్బులతో మా భవనం నిర్మిస్తానన్నారు. సొంతింటి కళతో పాటుగా.. వైద్య సహాయం.. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. అర్హుల పిల్లలకు కేజీ టూ పిజి ఉచిత విద్య.. సభ్యుల కుటుంబంలో పెళ్లికి కల్యాణ లక్ష్మీ కింద లక్షా 16 వేలు ఇస్తామని మంచు విష్ణు తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Read Also: మా ఎన్నికలు: మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

ఇక మొదటి నుంచి మంచు విష్ణు మా భవన నిర్మిస్తానని గట్టిగా చెపుతున్న సంగతి తెలిసిందే.. దీనిపైనా ఆయన మాట్లాడుతా.. వంద కోట్లైనా ఖర్చు పెడతానని ఈ సందర్బంగా తెలియజేశాడు. భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామన్నారు. ఇప్పటికే స్థలాన్ని చూశామని.. పెద్దల అంగీకారంతోనే భవన నిర్మాణం ఉంటుందని తెలిపాడు.

-Advertisement-మా భవనానికి వంద కోట్లైనా ఖర్చుపెడతాం: మంచు విష్ణు

Related Articles

Latest Articles