గిరిజనుల సేవలో నటుడు జీవ‌న్ కుమార్!

క‌రోనా క‌ష్ట‌కాలంలో నటుడు జీవ‌న్ కుమార్ నిర్మ‌ల్ జిల్లా గండి గోపాల్ పూర్, క‌ట్ట‌కింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల‌లో నివ‌సిస్తున్న 350 గిరిజన కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ అందించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీప్ర‌వీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జీవ‌న్ కుమార్ చేస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌లను పోలీస్ శాఖ‌వారు ప్ర‌శంసించారు. ఏజెన్సీ ఏరియాల‌లో జీవన్ చేస్తున్న స‌హాయం అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరారు. సమారిటన్స్ ఫర్ ది నేషన్, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, జీవన్ కుమార్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీటి పంపిణీ జరిగింది. ఇప్పటికే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన జీవన్ కుమార్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ‘ఏక్ మినీ కథ’లోనూ పోలీస్ అధికారి పాత్రను పోషించాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-