అనూహ్యంగా ‘మా’ బరిలోకి నటి హేమ!

‘మా’ ఎన్నికలతో (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పోటీదారులతో రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. జీవిత రాజశేఖర్‌ కూడా పోటీలో ఉంటుందనే వార్తలతో అంత ట్రయాంగిల్‌ వార్‌ అనుకున్నారు. అయితే, తాజాగా నటి హేమ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈసారి ‘మా’ బరిలో ఆమె కూడా దిగుతున్నట్లుగా నమ్మదగ్గ సమాచారం. ఇప్పటికే పోటీదారులు మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీగా ఉండగా.. హేమ కూడా త్వరలోనే టాలీవుడ్ పెద్దలను కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, 2019 ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్ ప్యానల్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమల మధ్య పోటీతో మరోసారి ‘మా’ లో ఆసక్తికరమైన పోరు నెలకొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-